Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

రిక్షా కార్మికుడి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబం!

16-07-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల పరిధిలోని జై కేసారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం...​గ్రామానికి చెందిన మోటే నాగయ్య (65, వృత్తి: రిక్షా కార్మికుడు)కు దాదాపు సంవత్సరం క్రితం ప్రమాదవశాత్తు కిందపడి కాలుకి తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో గాయపడిన తన కాలును చూపించుకునేందుకు ఈ ఏడాది మార్చి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి నాగయ్య తిరిగి ఇంటికి రాలేదు.​భర్త కోసం భార్య మోటే జంగమ్మ కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద, పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం (జూలై 16న) ఆమె చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మథ కుమార్ తెలిపారు.

Sthanikam

రిక్షా కార్మికుడి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News