Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్

16-07-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం మన్నపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి పేరుతో పోస్ట్‌కార్డుల ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ, 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, మహిళలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా సమాన వాటా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొగుడంపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మారుని బాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చున్ను బీ, పద్మమ్మ, తుల్జమ్మ, నర్సమ్మ, మంజుల, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం మన్నపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి పేరుతో పోస్ట్‌కార్డుల ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ, 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, మహిళలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా సమాన వాటా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొగుడంపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మారుని బాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చున్ను బీ, పద్మమ్మ, తుల్జమ్మ, నర్సమ్మ, మంజుల, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News