Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

విద్యార్థినిలు ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలి: చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

16-07-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కేజీబీవీ పాఠశాలలో ఘనంగా అవగాహన సదస్సు

విద్యార్థినిలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి, ఉన్నత ఆశయాలతో సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలని చౌటుప్పల్ డీఎస్పీ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను మంచి కోసం వాడుకోవాలని, సోషల్ మీడియా వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఆన్‌లైన్ మోసాలు,ఓటీపీ (OTP) స్కామ్‌లు, నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని,ఎలాంటి అనుమానాస్పద ఆన్‌లైన్ లింకులను క్లిక్ చేయవద్దని విద్యార్థినిలకు వివరించారు.

రోడ్డు భద్రత–జీవితానికి రక్ష

ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని తెలిపారు.​పాదచారుల భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.

​బాల్య వివాహాలు,బాలలపై జరిగే వేధింపుల పట్ల విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండాలని,ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.తల్లిదండ్రులు,గురువులను గౌరవిస్తూ..ఆత్మవిశ్వాసంతో చదువుకుని దేశ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థినిలను మోటివేట్ చేశారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్.హెచ్.ఓ జి. మన్మథ కుమార్, పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థినిలు ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలి: చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News