Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

ఈ నెల 17న అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర

16-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-పట్టణ ప్రాంత భక్తులందరికీ ఇస్కాన్ ఆహ్వానం

-భువనగిరి ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోపీజన వల్లభ మందిరం

భువనగిరి పట్టణంలోని విద్యానగర్‌లో ఉన్న ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోపీజన వల్లభ మందిరం ఆధ్వర్యంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) సాయంత్రం 3:30 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రథయాత్ర హైదరాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమై భువనగిరి ప్రధాన వీధుల గుండా ప్రయాణించి,విద్యానగర్‌లోని వైఎస్సార్ విగ్రహం వెనుక ఉన్న ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోపీజన వల్లభ మందిరం వద్ద ముగుస్తుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా హరినామ సంకీర్తనం,సంప్రదాయ నృత్య ప్రదర్శనలు,భక్తి సంగీత కార్యక్రమాలు,సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. రథయాత్రలో పాల్గొనే భక్తులందరికీ మహా ప్రసాదం (అన్న ప్రసాదం) ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడే ఆధ్యాత్మిక మహోత్సవాల్లో శ్రీ జగన్నాథ రథయాత్రకు విశిష్ట స్థానం ఉందని, రథాన్ని లాగడం, శ్రీ జగన్నాథ స్వామివారి దివ్య దర్శనం పొందడం,హరినామ సంకీర్తనలో పాల్గొనడం అత్యంత మంగళప్రదమని వేద శాస్త్రాలు పేర్కొంటున్నాయని వివరించారు.ఈ మహోత్సవంలో భువనగిరి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారి కృపను పొందాలని ఇస్కాన్ భువనగిరి ప్రతినిధులు హృదయపూర్వకంగా ఆహ్వానించారు.

Sthanikam

ఈ నెల 17న అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News