Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:21 PM

పుల్కుర్తి కేజీబీవీ హాస్టల్‌పై డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థినుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

15-07-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని పుల్కుర్తి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌ను డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న భోజనం, వసతి, తాగునీరు, పరిశుభ్రత, భద్రత, వైద్య సేవలను పరిశీలించి, విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని, నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు ప్రతి విద్యార్థికి సక్రమంగా అందేలా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. హాస్టల్ నిర్వహణలో లోపాలకు తావులేకుండా విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ తనిఖీలో తహసీల్దార్ విష్ణు సాగర్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్,ఎంపీడీఓ, హాస్టల్ ప్రిన్సిపాల్,పంచాయతీ కార్యదర్శి,సర్పంచ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పుల్కుర్తి కేజీబీవీ హాస్టల్‌పై డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థినుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని పుల్కుర్తి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌ను డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న భోజనం, వసతి, తాగునీరు, పరిశుభ్రత, భద్రత, వైద్య సేవలను పరిశీలించి, విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని, నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు ప్రతి విద్యార్థికి సక్రమంగా అందేలా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. హాస్టల్ నిర్వహణలో లోపాలకు తావులేకుండా విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ తనిఖీలో తహసీల్దార్ విష్ణు సాగర్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్,ఎంపీడీఓ, హాస్టల్ ప్రిన్సిపాల్,పంచాయతీ కార్యదర్శి,సర్పంచ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News