Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:42 PM

ఓటర్లందరూ 'ఎస్‌ఐఆర్'లో దరఖాస్తు చేసుకోవాలి: డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్

15-07-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు.

ఎంజీయూలో రౌండ్ టేబుల్ సమావేశం

సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీ సెమినార్ హాల్‌లో నిర్వహించిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

పారదర్శక ఎన్నికలకే సమగ్ర సవరణ

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ చేపట్టిందని తెలిపారు. 2002 తర్వాత మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల పారదర్శకతను పెంచడం, తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

18 ఏళ్లు నిండితే.. ఓటరుగా నమోదు తప్పనిసరి

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారు బీఎల్‌వోలు అందజేసిన దరఖాస్తులను పూరించి ఇవ్వాలని సూచించారు. చదువుకున్న వారు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

చనిపోయిన వారి పేర్ల తొలగింపు.. సందేహాలకు బీఎల్‌వోలే ఆధారం

సమగ్ర సవరణలో భాగంగా మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కృషి చేస్తోందని, ఓటర్లుగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. సందేహాలుంటే సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించాలని సూచించారు.

సవరణ గడువు పొడిగించాలని విజ్ఞప్తి

ప్రజలకు మరింత అవకాశం కల్పించేలా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ గడువును ఎన్నికల కమిషన్ పొడిగించాలని డా. కేశవులు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో పాల్గొన్నవారు

డా. వెంకటరమణారెడ్డి, డా. ఎల్. మధు, డా. శ్రీదేవి, డా. మ్యాచెండర్, పిట్టల శంకర్, కాసుల అజయ్ కుమార్, భోనగిరి సంతోష్ కుమార్, కరింగు వెంకన్న, డా. జి. నరసింహ, డా. సన్వేర్, డా. అనితా కుమారి, డా. సతిరెడ్డి, డా. శ్రీనివాస్, డా. షరీఫ్, డా. రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్లందరూ 'ఎస్‌ఐఆర్'లో దరఖాస్తు చేసుకోవాలి: డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News