Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

బకాయిలుంటే కరెంట్ కట్..

బకాయిలుంటే కరెంట్ కట్..

బకాయిలుంటే కరెంట్ కట్..
15-07-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రేపటి నుంచి విద్యుత్ శాఖ ప్రత్యేక డ్రైవ్ ఇంటి, దుకాణాల సర్వీసులపై చర్యలు.

చిట్యాల, జూలై 15: విద్యుత్ బకాయిల వసూళ్ల కోసం విద్యుత్ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 16వ తేదీ ఉదయం నుంచి ఇంటి విద్యుత్ కనెక్షన్లు, వాణిజ్య సంస్థలు, దుకాణాలకు సంబంధించిన బకాయిల వివరాలను పరిశీలించి, చెల్లింపులు చేయని వినియోగదారుల విద్యుత్ సర్వీసు వైర్లను తొలగించడం (కరెంట్ కనెక్షన్ నిలిపివేయడం) జరుగుతుందని హెచ్చరించారు.

విద్యుత్ బిల్లుల బకాయిలు ఉన్న వినియోగదారులు వెంటనే బకాయిలను చెల్లించి శాఖకు సహకరించాలని అధికారులు కోరారు. బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తే విద్యుత్ సరఫరా నిలిపివేతతో పాటు నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందన్నారు.

అందువల్ల గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారులందరూ తమ బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించి ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్త పడాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Sthanikam

బకాయిలుంటే కరెంట్ కట్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News