Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

డయల్ యువర్ డీఎం'కు భారీ స్పందన.

డయల్ యువర్ డీఎం'కు భారీ స్పందన.

డయల్ యువర్ డీఎం'కు భారీ స్పందన.
15-07-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

బస్సుల సమస్యలపై ప్రయాణికుల వెల్లువ...

పరిష్కారానికి డిపో మేనేజర్ హామీ.

అదనపు బస్సుల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం – డీఎం వేణుగోపాల్.

స్థానికం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ విషయాన్ని డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో సుమారు 35 మంది ప్రయాణికులు ఫోన్ ద్వారా తమ సమస్యలను నేరుగా డిపో యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా ఉదయం, సాయంత్రం పాఠశాలలు, కళాశాలల సమయాల్లో అదనపు బస్సులు నడపాలని, అలాగే 3KN రూట్‌లో బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో మరిన్ని సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, సీనియర్ సిటిజన్‌ల కోసం కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చొని లేవడం లేదని, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్‌ల కోసం మరిన్ని సీట్లు కేటాయించాలని కూడా కోరారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రయాణికులు సూచించిన సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అదనపు బస్సుల అవసరాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

అలాగే, పెళ్లిళ్లు, విహారయాత్రలు, శుభకార్యాల కోసం అద్దె ప్రాతిపదికన తక్కువ ధరల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Sthanikam

డయల్ యువర్ డీఎం'కు భారీ స్పందన.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News