Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

పటాన్‌చెరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.. నాణ్యమైన దర్యాప్తు, కమ్యూనిటీ పోలీసింగ్‌పై ప్రత్యేక ఆదేశాలు

15-07-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,ఐపీఎస్ పటాన్‌చెరు డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు,దర్యాప్తులో ఉన్న కేసులు, కార్యాలయ పనితీరును సమీక్షించారు. అనంతరం డీఎస్పీ ప్రభాకర్‌తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు.ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ,పోక్సో,అత్యాచారం,డౌరీ డెత్ వంటి కీలక కేసుల్లో నాణ్యమైన,వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పటాన్‌చెరు పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ట్రాఫిక్ నియంత్రణ, ఆస్తి సంబంధిత నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో పగలు, రాత్రి బీట్ విధులను మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించారు.అలాగే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో నేరాలపై అవగాహన పెంచాలని,సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, అన్ని రికార్డులు సీసీటీఎన్ఎస్‌లో నమోదు అయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు.డీఎస్పీ కార్యాలయ రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పటాన్‌చెరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.. నాణ్యమైన దర్యాప్తు, కమ్యూనిటీ పోలీసింగ్‌పై ప్రత్యేక ఆదేశాలు

Article Image

వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,ఐపీఎస్ పటాన్‌చెరు డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు,దర్యాప్తులో ఉన్న కేసులు, కార్యాలయ పనితీరును సమీక్షించారు. అనంతరం డీఎస్పీ ప్రభాకర్‌తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు.ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ,పోక్సో,అత్యాచారం,డౌరీ డెత్ వంటి కీలక కేసుల్లో నాణ్యమైన,వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పటాన్‌చెరు పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ట్రాఫిక్ నియంత్రణ, ఆస్తి సంబంధిత నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో పగలు, రాత్రి బీట్ విధులను మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించారు.అలాగే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో నేరాలపై అవగాహన పెంచాలని,సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, అన్ని రికార్డులు సీసీటీఎన్ఎస్‌లో నమోదు అయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు.డీఎస్పీ కార్యాలయ రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News