Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేతలను అభినందించిన పోలీసులు

15-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేతలను అభినందించిన పోలీసులు.......

ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించడం గర్వకారణం......

ఆత్మరక్షణ కొరకు కరాటే నేర్చుకోవాలి......

సీఐ శివ శంకర్ నాయక్.......

కరాటే పోటీల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏప్రిల్ 26న నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రపంచ వేదికపై కోదాడ పేరును మారుమోగించిన కరాటే మాస్టర్ కొండపల్లి క్రాంతి కుమార్, ఆయన శిక్షణలోని విద్యార్థులను సిఐ శివశంకర్, ఎస్ఐలు అభినందించి సన్మానించారు. అనంతరం సిఐ శివశంకర్ మాట్లాడుతూ కఠోర సాధన, నిరంతర శ్రమతోనే ఇలాంటి అంతర్జాతీయ విజయాలు సాధ్యమవుతాయన్నారు. కరాటే వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ఈ విజయం స్థానిక యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ముఖ్యంగా ఆత్మ రక్షణకు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు. కోదాడ చరిత్రలో ఈ గిన్నిస్ రికార్డ్ సాధన ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కుసుమ ఉపేందర్ రెడ్డి, అజయ్ కుమార్, మల్సూర్, విజేతలైన విద్యార్థులు పొక్కుల ప్రణీత్, పొక్కుల రక్షిత్, శీలం వరుణ్, కంకిపాటి ఉదితి, తిరగమల్ల వేదశ్రీ నిత్య, మోకా అక్షయ, మోకా అక్షిత, వేముల కరుణ్ కుమార్, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు......

Sthanikam

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేతలను అభినందించిన పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News