Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ఉన్ని సంఘానికి కొత్త సారథ్యం

ఉన్ని సంఘానికి కొత్త సారథ్యం

ఉన్ని సంఘానికి కొత్త సారథ్యం
15-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గుండ్రాంపల్లిలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.. సభ్యుల సంక్షేమమే లక్ష్యమన్న అధ్యక్షుడు కాసు గణేష్.

చిట్యాల, జూలై 15: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ఉన్ని సహకార సంఘం నూతన పాలకవర్గం బుధవారం ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించింది. సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కాసు గణేష్ తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కురుమ కుల బంధువులు, సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అతిథులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాసు గణేష్ మాట్లాడుతూ ఉన్ని సహకార సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసి జిల్లాలోనే ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. ఉన్ని పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటూ సభ్యులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో నూతన పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం అతిథులకు భోజన విందు ఏర్పాటు చేశారు. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం సంఘ సభ్యుల్లో కొత్త ఆశలు, నమ్మకాలను నింపింది.

నూతన కార్యవర్గం

అధ్యక్షుడు: కాసు గణేష్ (గుండ్రాంపల్లి)

ఉపాధ్యక్షుడు: కంకల బీరయ్య (ఎల్లంబావి)

కార్యదర్శి: కొండె వెంకటేష్ (ఏపూర్)

కోశాధికారి: దిందే ఆడవయ్య (కాట్రేవు)

డైరెక్టర్లు

కంకల బుగ్గమ్మ (గుండ్రాంపల్లి)

బండ కేతమ్మ (గుండ్రాంపల్లి)

వస్పరి జహంగీర్ (అంతమ్మగూడెం)

కొండె మహేష్ (వేలిమినేడు)

బాలం జంగయ్య (ఎల్లంబావి)

"సభ్యుల ఐక్యతతో సంఘాభివృద్ధి సాధ్యం" అనే సందేశంతో గుండ్రాంపల్లి ఉన్ని సహకార సంఘం నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టడం విశేషంగా నిలిచింది.

Sthanikam

ఉన్ని సంఘానికి కొత్త సారథ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News