Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 15, 2026 11:02 PM

రోగులకు ప్రేమతో నాణ్యమైన వైద్యమందించాలి..

రోగులకు ప్రేమతో నాణ్యమైన వైద్యమందించాలి..

రోగులకు ప్రేమతో నాణ్యమైన వైద్యమందించాలి..
July 15, 2026 08:39 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


కమలా నెహ్రూ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ బి. చంద్రశేఖర్..

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక..

​నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా గౌరవంగా వ్యవహరిస్తూ వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, వైద్య సేవల తీరుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

విధుల్లో లేని సిబ్బందిపై ఆగ్రహం

రోగులతో ముఖాముఖి..

​తనిఖీలో భాగంగా కలెక్టర్ ముందుగా 'ఆరోగ్య మిత్ర' కౌంటర్‌ను పరిశీలించారు. అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇందుకు గల కారణాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరారు. అనంతరం చికిత్స కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో సీటు వచ్చిన తమ కుమార్తెకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చామని ఓ కుటుంబం కలెక్టర్‌కు తెలిపింది. 350 మిల్లీగ్రాముల గ్లూకోజ్ (షుగర్) స్థాయితో చికిత్స కోసం వచ్చిన మరో మహిళకు కలెక్టర్ ధైర్యం చెప్పారు. వెంటనే డ్యూటీ వైద్యుడిని పిలిచి.. ఆమెకు సరైన ఆహార నియమాలను (డైట్ ప్లాన్) వివరిస్తూ తగిన వైద్యం అందించాలని ఆదేశించారు.

రికార్డులు పక్కాగా ఉండాలి..

​ఫార్మసీ (మందుల పంపిణీ కేంద్రం)ని తనిఖీ చేసిన కలెక్టర్, మందుల నిల్వలు మరియు పంపిణీ వివరాలను రిజిస్టర్లలో కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. రోజుకు సుమారు 200 మంది రోగులు ఓపీ విభాగానికి వస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ సిబ్బందితో మాట్లాడిన ఆయన.. ప్రసవం కోసం వచ్చే గర్భిణులతో అత్యంత గౌరవంగా ప్రవర్తించాలని వారికి సకాలంలో మెరుగైన కాన్పు సేవలు అందించాలని సూచించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కోతుల నివారణకు ఏబీసీ కేంద్రం..

​కుక్కలు, కోతులు కరిచిన బాధితులకు అవసరమైన యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు, ఇతర మందుల నిల్వలపై కలెక్టర్ ఆరా తీశారు. సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాగా, కోతి దాడిలో గాయపడిన ఒక బాలికను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆసుపత్రికి తీసుకురాగా.. ఆ ఘటనపై కలెక్టర్ స్పందించారు. బాలికకు అవసరమైన చికిత్స అందుతోందని, తగినన్ని మందులు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కోతుల సమస్య నివారణకు త్వరలోనే ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

​ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ చికిత్స పొందుతున్న రోగి కొల్లి రామలింగంను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ సేవలు చాలా సంతృప్తికరంగా అందుతున్నాయని సదరు రోగి కలెక్టర్‌కు వివరించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ మానస స్వర్ణ సుమన్, తహసిల్దార్ ఖాసీం, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. సైదులు, డాక్టర్ అనితా రాణి మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News