Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:56 PM

NOC కోసం లంచం.. ACB వలలో భూగర్భజల శాఖ అధికారులు

15-07-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సూర్యాపేటలో అసిస్టెంట్ డైరెక్టర్, డేటా ఆపరేటర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత.

సూర్యాపేట, జూలై 15: బోర్‌వెల్‌కు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన భూగర్భజల శాఖ అధికారులను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. బోర్‌వెల్ యజమాని నుంచి ఎన్‌ఓసీ మంజూరు కోసం రూ.20 వేల లంచం కోరిన భూగర్భజల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలు నాయక్, డేటా ఆపరేటర్ వెంకటేశ్వర్లుపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నల్గొండ ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని, సంబంధిత కార్యాలయంలో అవసరమైన పత్రాలు, రికార్డులను పరిశీలించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ప్రభుత్వ సేవలు అందించాల్సిన అధికారులు ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేయడం బాధాకరమని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Sthanikam

NOC కోసం లంచం.. ACB వలలో భూగర్భజల శాఖ అధికారులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News