Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

వలిగొండ రోడ్డుపై 'గులాబీ' సమరం!

వలిగొండ రోడ్డుపై 'గులాబీ' సమరం!

వలిగొండ రోడ్డుపై 'గులాబీ' సమరం!
15-07-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గోతుల రహదారిపై భగ్గుమన్న బీఆర్‌ఎస్ శ్రేణులు.. దారి పొడవునా బైఠాయింపు

రాజకీయ పైరవీలే తప్ప ప్రజాసమస్యలపై ఎమ్మెల్యేకు పట్టేది లేదు: కూసుకుంట్ల ఫైర్

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ రోడ్డు దుస్థితిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డుపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు, స్థానికులు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ నుంచి భువనగిరికి వెళ్లే ఈ ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలిగొండ రోడ్డులోని అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి, రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.​​ఎన్నికల సమయంలో ఆగమేఘాల మీద నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని ఉద్ధరిస్తామని కొబ్బరికాయ కొట్టారని,ఇప్పటికి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పనులు తాంబేలు కంటే మెల్లగా సాగుతున్నాయని మండిపడ్డారు.స్థానిక ఎమ్మెల్యే సొంత ప్రైవేటు కార్యక్రమాలకు,పెళ్లిళ్లకు తిరుగుతూ ఇదే రోడ్డు గుండా వెళ్తున్నా రహదారి దుస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.చౌటుప్పల్ ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేసిన ఎమ్మెల్యే, కేవలం తన మంత్రి పదవి కోసమే పైస్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారని ఆరోపించారు.​ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

వలిగొండ రోడ్డుపై 'గులాబీ' సమరం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News