Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

నీటిని వృధా చేయొద్దు.. ఒడిసి పట్టుకోవాలి!

15-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జడ్పీహెచ్ఎస్ తంగడపల్లిలో ‘జల సంవాద్’ కార్యక్రమం

​విద్యార్థులతో ‘జల ప్రతిజ్ఞ’ చేయించిన మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్

ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉందని,అందువల్ల అందుబాటులో ఉన్న వర్షపు నీటిని,భూగర్భ జలాలను అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర నాయక్ పిలుపునిచ్చారు. జాతీయ జల మిషన్ ‘జల్ శక్తి అభియాన్ – క్యాచ్ ది రైన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం తంగడపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో "జల ప్రతిజ్ఞ" కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ..ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను,వాటి నిర్మాణ ఆవశ్యకతను ఆయన ఈ సందర్భంగా వివరించారు.​ఇళ్లలో నీటిని వృధా చేయకుండా జాగ్రత్త వహించాలి. ​పైకప్పుపై ఉన్న సింటెక్స్ ట్యాంక్ నిండగానే మోటార్‌ను వెంటనే బంద్ చేయాలి.కింద ఉన్న సంప్ లేదా ట్యాంక్ నిండినప్పుడు నీటి పంపు వాల్‌ను మూసివేయాలి. ఈ విషయాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, ఇంట్లో పెద్దలకు కూడా చెప్పి నీటి వృధాను అరికట్టాలని సూచించారు.​అనంతరం పాఠశాల విద్యార్థులందరితో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి,పీఈటీ లింగయ్య, ఉపాధ్యాయ బృందం, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్,టీపీబీఓ సాయి కుమార్,జూనియర్ అకౌంటెంట్ శ్రీనాథ్,మున్సిపల్ సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నీటిని వృధా చేయొద్దు.. ఒడిసి పట్టుకోవాలి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News