Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత!

Updated : 15 Jul 2026 21:01 IST
As Preferred Source 1 min read
రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత!

​నియమాలు పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం: ట్రాఫిక్ సీఐ ఎన్. వెంకటేష్

రహదారి నియమాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఎన్నో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ ఎన్. వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లా ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్ ఆదేశాల మేరకు,

ట్రాఫిక్ డిఎస్పి ఎం ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ లతో కలిసి బుధవారం చిన్నకొండూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు.​ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.​కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్ట్ పెట్టుకోవాలి.​మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్,డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం.​రోడ్డు ప్రమాదాలుజరిగినప్పుడు వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించి, బాధితులకు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని కోరారు.ఈ​కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news