Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పీహెచ్‌సీకి కరెంటివ్వండి.. వెంటనే ప్రారంభించండి!

Updated : 15 Jul 2026 21:01 IST
As Preferred Source 1 min read
పీహెచ్‌సీకి కరెంటివ్వండి.. వెంటనే ప్రారంభించండి!

నూతన భవనాన్ని పరిశీలించిన సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

ప్రారంభానికి నోచుకోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

మండలంలోని తంగడపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ సీపీఎం మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి తంగడపల్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.​అనంతరం జహంగీర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం రూపుదిద్దుకున్న ఈ నూతన ఆరోగ్య కేంద్రంలో భవనం,ఇతర మౌలిక వసతులు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ,కేవలం విద్యుత్ కనెక్షన్ లేకపోవడం వల్లే ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడిందని మండిపడ్డారు.​​గ్రామీణ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ భవనానికి కరెంటు సౌకర్యం కల్పించాలి.​ఆసుపత్రికి అవసరమైన పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని,మందులను,వైద్య పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాలి.​ఈ పీహెచ్‌సీ గనుక అందుబాటులోకి వస్తే తంగడపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా,గోశిక కరుణాకర్, బత్తుల దాసు,తూర్పునూరి మల్లేశం,కందగట్ల ఆనంద్, చికూరి ఈదయ్య,కనకయ్య, సిలువేరు జంగయ్య, రాములు,ఎండీ జావిద్, స్వామి,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పీహెచ్‌సీకి కరెంటివ్వండి.. వెంటనే ప్రారంభించండి!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news