Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 15, 2026 10:33 PM

ఖాళీ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి.. హైదరాబాద్ మహాధర్నాకు నల్గొండ నుంచి సీపీఎం శంఖారావం

ఖాళీ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి.. హైదరాబాద్ మహాధర్నాకు నల్గొండ నుంచి సీపీఎం శంఖారావం

ఖాళీ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి..  హైదరాబాద్ మహాధర్నాకు నల్గొండ నుంచి సీపీఎం శంఖారావం
July 15, 2026 09:01 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మహాధర్నాకు నల్గొండ జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. నల్గొండ పట్టణం నుంచి బయలుదేరిన వాహనాలను సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హశం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీలను విశ్వసించి రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఉద్యోగాల భర్తీ విషయంలో ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో యువత తీవ్ర నిరాశకు గురవుతోందని విమర్శించారు.

రంగారెడ్డి జిల్లాలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకుండా కాలయాపన చేస్తోందని అన్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముఖ్యంగా 19 వేల పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రకటించి, కాలపరిమితితో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై కూడా సయ్యద్ హశం విమర్శలు గుప్పించారు. ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.

ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతను ఐక్యం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాలను కోరారు.

హైదరాబాద్‌లో జరిగిన మహాధర్నా ద్వారా నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని సీపీఎం నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, పట్టణ, మండల నాయకులు బండ శ్రీశైలం, ఎం.డి. సలీమ్, దండెంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు, మల్లం మహేష్, బొల్లు రవీందర్, ఎం. కిరణ్, కండె యాదగిరి, ఎం.డి. ఆదిల్, రాజేష్, నవదీప్తదితరులు పాల్గొని మహాధర్నాకు సంఘీభావం తెలిపారు. పార్టీ నాయకులు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని పునరుద్ఘాటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News