Sthanikam - Truth Matters
Logo

నిద్రలో ఉన్న యువకుడిపై గొడ్డలితో దాడి.. సూర్యాపేటలో సంచలనం

Updated : 16 Jul 2026 01:32 IST
As Preferred Source 1 min read
నిద్రలో ఉన్న యువకుడిపై గొడ్డలితో దాడి.. సూర్యాపేటలో సంచలనం

గంజాయి అలవాటు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన.. తల్లిపై అనుమానంతో పోలీసుల దర్యాప్తు.

సూర్యాపేట, జూలై 15:

సూర్యాపేట పట్టణంలో ఓ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. భూక్యా విజయ్ అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తలపై గొడ్డలితో దాడి జరగడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

స్థానికుల కథనం ప్రకారం, విజయ్ కొంతకాలంగా గంజాయికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని, ముఖ్యంగా తన తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తరచూ గొడవలకు దిగేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాల కోణాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, విజయ్ తల్లి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

Sthanikam

నిద్రలో ఉన్న యువకుడిపై గొడ్డలితో దాడి.. సూర్యాపేటలో సంచలనం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి