Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:29 AM

కూసుకుంట్లవి 'పనికిమాలిన' పుకార్లే!

కూసుకుంట్లవి 'పనికిమాలిన' పుకార్లే!

కూసుకుంట్లవి 'పనికిమాలిన' పుకార్లే!
16-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం: కాంగ్రెస్ శ్రేణుల హెచ్చరిక

మునుగోడు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా నీవుంటావో ఉండవో ముందు తేల్చుకో!

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన నిరాధారమైన, తప్పుడు ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వలిగొండ రోడ్డు వద్ద కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేపట్టిన ధర్నా, చేసిన విమర్శలపై బుధవారం చౌటుప్పల్ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసార్ల శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్

ప్రేస్ మీట్ నిర్వహించి తీవ్రంగా ధ్వజమెత్తారు.​ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి ఎన్నో నిధులు మంజూరైనట్లు గొప్పలు చెప్పుకున్న కూసుకుంట్ల, ఆ పనులను ఎందుకు పూర్తి చేయించలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. రాజగోపాల్‌రెడ్డి చొరవతోనే నియోజకవర్గంలో కీలక పనులు సాగుతున్నాయని స్పష్టం చేశారు.

మంత్రి పదవిపై ఓర్వలేకనే ఏడుపు:

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి రావాలని రాష్ట్ర ప్రజలు, నాయకులు కోరుకుంటున్నారని.. ఆయనకు మంత్రి పదవి వస్తే మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. దీనిని ఓర్వలేకనే కూసుకుంట్ల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందు కూసుకుంట్ల మునుగోడు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా ఉంటారో ఉండరో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు.

అభివృద్ధి పనుల వివరాలు:

రాజగోపాల్‌రెడ్డి హయాంలోనే వలిగొండ రోడ్డు నిర్మాణం, చౌటుప్పల్ మున్సిపాలిటీకి 100 పడకల ఆసుపత్రి మంజూరు, చౌటుప్పల్ నుండి మునుగోడు వరకు డబుల్ లేన్ బీటీ రోడ్డు నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు.

​వరద కాలువ అక్రమాలపై నిలదీత:

వలిగొండ రోడ్డు వరద కాలువ సమస్యపై మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమ కట్టడాలను ఎందుకు ప్రోత్సహించారో, అందులో ఎవరి ఆశ్రిత వశుల హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం ఆర్డీవో, ఎంఆర్‌వోల సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో నిబంధనల ప్రకారం 30 ఫీట్ల వరద కాలువ నిర్మాణం చేపట్టామని వివరించారు.వరద కాలువను అడ్డు పెట్టుకొని రాజగోపాల్‌రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే మునుగోడు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. ఇప్పటికైనా పనికిమాలిన తప్పుడు ప్రకటనలు మానుకొని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.

Sthanikam

కూసుకుంట్లవి 'పనికిమాలిన' పుకార్లే!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News