Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

కస్తూర్బా గాంధీ పాఠశాలలో 'పోలీస్ అక్క' అవగాహన

16-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 'పోలీస్ అక్క' అవగాహన సదస్సు నిర్వహించారు. నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రత కోసం జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు 'పోలీస్ అక్క' అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా పోలీస్ అధికారిని 'పోలీస్ అక్క'గా నియమించడం జరిగిందని వివరించారు. ఈ 'పోలీస్ అక్క' తన పరిధిలోని ప్రతి పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థినులతో సమయాన్ని కేటాయిస్తారని చెప్పారు. మీ సొంత అక్క లాగా మీతో కలిసిపోయి, మీ సమస్యలను ఓపిగ్గా విని, మీ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తారని భరోసా ఇచ్చారు. "పోలీస్ అక్క ఎల్లప్పుడూ మీకోసం ఉంటుంది" అని స్పష్టం చేశారు. ఏదైనా ఆపద లేదా అత్యవసర సమయాల్లో బాలికలు భయపడకుండా తక్షణ సహాయం కోసం 112 మరియు 100 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న మొబైల్ యాప్‌లను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని అవగాహన కల్పించారు. విద్యాలయంలో పోలీస్ అక్క కమిటీలు ఏర్పాటు చేస్తాం అని అన్నారు. మహిళలను ఎవరైనా వేదిస్తే కఠిన చర్యలు తప్పవు అని సిఐ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్ రెడ్డి, పోలీస్ అక్క కానిస్టేబుల్ మౌనిక, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కస్తూర్బా గాంధీ పాఠశాలలో 'పోలీస్ అక్క' అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News