Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:45 AM

15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

17-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామ పంచాయతీల 15వ ఆర్థిక సంఘం నిధులను పెండింగ్ విద్యుత్ బిల్లులకు మళ్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల సర్పంచులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీల విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కేంద్ర నిధులను మళ్లించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక స్వపరిపాలన బలోపేతం కోసం ఈ నిధులను గ్రామాల ప్రగతికే వినియోగించేలా చూడాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సర్పంచులు సుర్వి మల్లేష్ గౌడ్, జి. నిరంజన్ గౌడ్, నందగిరి వెంకటేష్ గౌడ్, స్వప్న, మహేంద్ర మణి, భారతమ్మ తదితరులు ఉన్నారు.

Sthanikam

15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

Article Image

గ్రామ పంచాయతీల 15వ ఆర్థిక సంఘం నిధులను పెండింగ్ విద్యుత్ బిల్లులకు మళ్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల సర్పంచులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీల విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కేంద్ర నిధులను మళ్లించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక స్వపరిపాలన బలోపేతం కోసం ఈ నిధులను గ్రామాల ప్రగతికే వినియోగించేలా చూడాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సర్పంచులు సుర్వి మల్లేష్ గౌడ్, జి. నిరంజన్ గౌడ్, నందగిరి వెంకటేష్ గౌడ్, స్వప్న, మహేంద్ర మణి, భారతమ్మ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News