Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:21 AM

ఏపీకి భారీ పెట్టుబడులు – వేలాది ఉద్యోగాలు రానున్నాయి: గడ్డా ఫక్రుద్దీన్

17-07-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మరిన్ని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయని, దీంతో రాష్ట్ర యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని టీడీపీ ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు.

శుక్రవారం ఆదోనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా మారిందన్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో మంత్రి లోకేష్ సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం–రాష్ట్రం సమన్వయంతో పనిచేస్తున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. దీనికి దక్షిణ కొరియా ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని చదువుకున్న యువతకు ఉపాధి కల్పించేందుకు కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు త్వరలోనే రానున్నాయని గడ్డా ఫక్రుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు.

అదేవిధంగా కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్ లిమిటెడ్ లైన్–2 విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారని తెలిపారు. రూ.3,100 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 6.1 మిలియన్ టన్నుల క్లింకర్, 9.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యానికి పెరుగుతుందని చెప్పారు.

ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 1,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

ఏపీకి భారీ పెట్టుబడులు – వేలాది ఉద్యోగాలు రానున్నాయి: గడ్డా ఫక్రుద్దీన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News