Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:48 AM

స్వామి నాయక్ అసాధారణ ప్రతిభకు ముగ్ధుడైన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

18-07-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం లప్ప నాయక్ తండాలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చెందిన శారీరక వికలాంగుడు స్వామి నాయక్ ప్రదర్శించిన అసాధారణ ప్రతిభ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా స్వామి నాయక్ ప్రతిభను వీక్షించి అబ్బురపడ్డారు.చేతులు లేకపోయినా కాళ్ల వేళ్లతో మొబైల్ ఫోన్‌ను అత్యంత చాకచక్యంగా నిర్వహిస్తున్న స్వామి నాయక్, అదే కాళ్ల వేళ్ల సహాయంతో తెల్ల కాగితంపై "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య కు ధన్యవాదాలు" అని రాయడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. శారీరక వైకల్యం తన సంకల్పానికి అడ్డుకాదని స్వామి నాయక్ నిరూపించిన తీరు పలువురి ప్రశంసలను అందుకుంది.

స్వామి నాయక్ పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అభినందించిన బీర్ల ఐలయ్య, జనగామ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆయనకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా స్వామి నాయక్‌ను శాలువాతో సన్మానించిన బీర్ల ఐలయ్య, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఆయన అందరికీ ఆదర్శమని కొనియాడారు. స్వామి నాయక్ ప్రతిభ, పట్టుదల అక్కడున్న ప్రతి ఒక్కరినీ ప్రేరేపించింది.

Sthanikam

స్వామి నాయక్ అసాధారణ ప్రతిభకు ముగ్ధుడైన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News