Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:45 AM

శ్రీ ఆర్.కె ఆసుపత్రిలో 4.5 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు

18-07-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ఆర్.కె.హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ చావా రాజ్‌కుమార్

భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్‌లో 4.5 కిలోల బరువున్న భారీ అండాశయ కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు.నాలుగు గంటలపాటు సాగిన క్లిష్ట శస్త్రచికిత్సను ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చావా రాజ్‌కుమార్,సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ వి.రాజ్‌కుమార్,అనస్థీషియా నిపుణుడు డాక్టర్ బి.నరేష్,జనరల్ సర్జన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది.వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం,భువనగిరికి చెందిన ఓ మహిళ గత నెల రోజులుగా పొత్తికడుపు దిగువ భాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. తొలుత స్థానికంగా చికిత్స పొందినా సమస్య తగ్గకపోవడంతో స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా 22×18 సెంటీమీటర్ల పరిమాణంలో అండాశయ కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది.రోగికి ఇప్పటికే బీపీ,మధుమేహం,ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే రోగి స్థానికంగానే చికిత్స పొందాలని నిర్ణయించుకుని శ్రీ ఆర్కే హాస్పిటల్‌లో డాక్టర్ చావా రాజ్‌కుమార్‌ను సంప్రదించారు. అనంతరం సీనియర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో నాలుగు గంటలపాటు సాగిన శస్త్రచికిత్స ద్వారా 4.5 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని,పూర్తిగా కోలుకున్న అనంతరం నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని శ్రీ ఆర్కే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చావా రాజ్‌కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భువనగిరి పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడమే తమ లక్ష్యమన్నారు.సి-ఆర్మ్, లాపరోస్కోపిక్ సర్జరీతో పాటు పలు ఆధునిక వైద్య సదుపాయాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Sthanikam

శ్రీ ఆర్.కె ఆసుపత్రిలో 4.5 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News