హైదరాబాద్
మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడును విశ్వవిద్యాలయాల దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ కలిసి దివ్యాంగుల హక్కుల చట్టం–2016 అమలుపై వినతిపత్రం అందజేశారు. ఫిలింనగర్‌లో జరిగిన 'శ్వాస' పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయనను కలిసిన డాక్టర్ అశోక్.. చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దం పూర్తయినా కీలక నిబంధనలు అమలు కావడం లేదని వివరించి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని సమర్థంగా అమలు చేసేలా కృషి చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన వెంకయ్య నాయుడు.. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇవ్వడంతో పాటు, ఈ అంశంపై ఉద్యమం చేస్తున్న డాక్టర్ అశోక్‌ను అభినందించారు. కార్యక్రమంలో మారలేని చంద్రశేఖర్ యాదవ్, దొరపల్లి దానమ్మ, కూర్మ ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి