రామన్నపేట,
విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి అన్నారు. రామన్నపేట మండలం దుబ్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు.
విద్యా హక్కు, బాలకార్మిక నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధం, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలలో లేదా బయట ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి, పోలీసులకు లేదా న్యాయ సేవాధికార సంస్థకు వెంటనే ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మజీద్, అడ్వకేట్లు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి