Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:20 AM

వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి: బీఆర్ఎస్ రైతుల నిరసన

18-07-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

వ్యవసాయానికి ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య (మాజీ ఎంపీపీ) మాట్లాడుతూ, గత వారం రోజులుగా కొనసాగుతున్న విద్యుత్ కోతల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.విద్యుత్ అంతరాయాల కారణంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండటంతో వాటి మరమ్మతుల కోసం రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, స్వల్పంగా లభిస్తున్న బోరు నీటితో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో విద్యుత్ కోతలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే విద్యుత్ కోతలను ఎత్తివేసి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా మోసపూరిత పాలన సాగిస్తోందని ఆరోపించారు.రైతాంగానికి న్యాయం చేయకపోతే ప్రజలు తగిన సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీను, గుడిపాటి వీరయ్య, మట్టిపెల్లి వెంకట్, గునిగంటి యాదగిరి, గౌడిచర్ల సత్యనారాయణ, గడ్డం సోమేశ్, పూర్ణ నాయక్, తడకమళ్ల రవికుమార్, సర్పంచ్‌లు మనోజ్, మాతంగి వెంకటమ్మ, కరుణాకర్, మాజీ సర్పంచ్ వీరోజీ, యాకూ నాయక్, కళ్యాణ్, గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, నాగమల్లు, శ్రీకాంత్, సాయికిరణ్, మహేందర్, భాస్కర్, రమేష్, వెంకన్న, వీరన్న, సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి: బీఆర్ఎస్ రైతుల నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News