Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:13 PM

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

18-07-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

'జాతీయ జల మిషన్' అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

భూగర్భ జలాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, రాబోయే రోజుల్లో నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 'జాతీయ జల మిషన్' కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని అన్నా మెమోరియల్ స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ చిన్నప్ప రెడ్డి విద్యార్థులు, సిబ్బందితో 'జల ప్రతిజ్ఞ' చేయించారు. ​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండి ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకోవాలన్నారు. నీటి సంరక్షణలో యువత, విద్యార్థులు అగ్రభాగంలో నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మన్మధ కుమార్, కౌన్సిలర్లు బుడ్డ సురేష్, చింతల ఉమామహేశ్వరి, మున్సిపల్ అధికారులు హనుమాన్ ప్రసాద్, రేణు కుమార్, వార్డు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News