Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

18-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.10,500 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. శనివారం చౌటుప్పల్‌లోని శ్రీ చైతన్య పారామెడికల్ కళాశాలలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ఎస్‌ఎఫ్‌ఐ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ​ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఉన్నత చదువులకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని, బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బకాయిల సాధన కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేసే పోరాటాలకు కళాశాల యాజమాన్యాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ

మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, అరవింద్, మల్లేష్, పలు కళాశాలల ప్రిన్సిపల్స్ శేఖర్ రెడ్డి, శిలువేరు శ్రీనివాస్, కట్టెల లింగస్వామి, మహేందర్ రెడ్డి, జంగయ్య, ఆంజనేయులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News