Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:18 AM

బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
18-07-2026 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి బస్సులో వెళ్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కృష్ణా జిల్లా నిడమనూరుకు చెందిన పటాన్ ఖాదర్బాషా (41) మ్యారేజ్ బ్యూరోలో పని చేస్తున్నాడు. ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చి, తిరిగి శుక్రవారం రాత్రి ప్రైవేట్ బస్సులో నిడమనూరుకు బయలుదేరాడు. శనివారం తెల్లవారుజామున 1:40 గంటల సమయంలో బస్సు లక్కారం వద్దకు రాగానే ఖాదర్బాషాకు ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చేసరికే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య పఠాన్ మహిరుణ్ణిశ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News