Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రారంభానికి సిద్ధమైన మర్రిగూడ ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలి: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాస్తారోకో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 19, 2026 12:03 AM

ఫ్లైఓవర్‌పై రాజకీయాలు మానాలి..! మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి మేయర్ బుర్రి చైతన్య స్ట్రాంగ్ వార్నింగ్

ఫ్లైఓవర్‌పై రాజకీయాలు మానాలి..! మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి మేయర్ బుర్రి చైతన్య స్ట్రాంగ్ వార్నింగ్

ఫ్లైఓవర్‌పై రాజకీయాలు మానాలి..! మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి మేయర్ బుర్రి చైతన్య స్ట్రాంగ్ వార్నింగ్
July 18, 2026 08:58 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
  1. మర్రిగూడ ఫ్లైఓవర్ పూర్తికి మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవే కారణమని స్పష్టం
  2. భూసేకరణ, విద్యుత్ లైన్ సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు వేగం పుంజుకున్నాయని వెల్లడి
  3. చౌకబారు రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిక

మర్రిగూడ ఫ్లైఓవర్ అంశంపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నల్లగొండ నగరపాలిక మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫ్లైఓవర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయ డ్రామాలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. నల్లగొండ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

మేయర్ మాట్లాడుతూ, మర్రిగూడ ఫ్లైఓవర్ పూర్తికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటికీ, భూసేకరణ పూర్తి చేయకుండా ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిందని ఆరోపించారు. అవసరమైన భూమిని సేకరించకుండానే పనులు ప్రారంభించినట్లు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టిందెవరో అందరికీ తెలుసని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉన్న ప్రధాన అడ్డంకులను తొలగించిందని మేయర్ తెలిపారు. భూసేకరణ కోసం సుమారు రూ.8 కోట్ల నిధులువిడుదల చేసి ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

అంతేకాకుండా, ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న132 కేవీ విద్యుత్ లైన్ షిఫ్టింగ్‌కు గత ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో రూ.2.50 కోట్ల నిధులుమంజూరు చేయించి విద్యుత్ లైన్ మార్పిడి పనులను పూర్తి చేయడంతో నిర్మాణానికి మార్గం సుగమమైందని వివరించారు.

పదేళ్లు అధికారంలో ఉండి పూర్తి చేయలేని అభివృద్ధి పనులపై ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మేయర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేకు తగిన తీర్పు ఇచ్చారని, అయినా ఇప్పటికీ వాస్తవాలను అంగీకరించకుండా రాజకీయ విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు అభివృద్ధికి ఓటు వేస్తారని, ప్రజల విశ్వాసం కోల్పోయిన నాయకులకు డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి వస్తుందని రాజకీయ సవాల్ విసిరారు. నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలోనే వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

ఫ్లైఓవర్ వంటి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను రాజకీయాలకు వేదికగా మార్చకుండా, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని మేయర్ సూచించారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, అభివృద్ధిని అడ్డుకునే విధంగా చౌకబారు రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నల్లగొండ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News