Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:24 AM

నకిలీ డి.ఏ.పీ దందా బట్టబయలు.500 బస్తాలు స్వాధీనం హైదరాబాద్ కేంద్రంగా తయారీ..

18-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతులను మోసం చేస్తున్న ముఠాపై ఉక్కుపాదం.

హుజూర్‌నగర్, జూలై 18:

రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ ఎరువులను విక్రయిస్తూ భారీ మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టును వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. హుజూర్‌నగర్ వ్యవసాయ శాఖ పరిధిలో సుమారు 500 బస్తాల నకిలీ డి.ఏ.పీ ఎరువులను స్వాధీనం చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది.

హుజూర్‌నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రవి తెలిపిన వివరాల ప్రకారం, మూడు రోజుల క్రితం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మట్టంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేకుండా కొందరు డీలర్లు రైతులకు డి.ఏ.పీ పేరుతో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ సుమారు 100 బస్తాల నకిలీ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో ఇదే ముఠా మేళ్లచెరువు మండలంలో మరో 400 బస్తాల నకిలీ ఎరువులను విక్రయించినట్లు తేలింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌లో తయారీ కేంద్రం..

దర్యాప్తులో ఈ నకిలీ ఎరువుల తయారీ వెనుక హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అక్రమ యూనిట్ ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా వ్యవసాయ శాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న ఎరువుల నమూనాలను ప్రయోగశాలకు పంపగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. అసలైన డి.ఏ.పీలో ఉండాల్సిన భాస్వరం పూర్తిగా లేకపోగా, నత్రజని కేవలం 1 శాతం మాత్రమే ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.

రైతులకు రెట్టింపు నష్టం

ఇలాంటి నకిలీ ఎరువుల వాడకం వల్ల రైతులు కొనుగోలు చేసిన డబ్బు వృథా కావడమే కాకుండా, పంటలకు అవసరమైన పోషకాలు అందక దిగుబడులు తీవ్రంగా దెబ్బతింటాయని అధికారులు హెచ్చరించారు.

ఫలితంగా రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.

అనధికార డీలర్ల వద్ద కొనొద్దు

లైసెన్స్ కలిగిన ఎరువుల దుకాణాల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని, అనుమానాస్పదంగా ఎవరైనా నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు తెలిసినా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని హుజూర్‌నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రవి సూచించారు. నకిలీ ఎరువుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నకిలీ ఎరువుల మాఫియాపై అధికారుల ఉక్కుపాదంతో రైతుల్లో కొంత ఊరట కనిపిస్తున్నా, ఇప్పటికే ఎంతమంది రైతులు ఈ మోసానికి బలయ్యారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

నకిలీ డి.ఏ.పీ దందా బట్టబయలు.500 బస్తాలు స్వాధీనం హైదరాబాద్ కేంద్రంగా తయారీ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News