Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

మహిళా వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

మహిళా వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

మహిళా వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
28-07-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ

మండల నూతన కమిటీ ఎన్నిక

సమాజంలో రోజురోజుకీ మహిళలపై పెరుగుతున్న వివక్షను అరికట్టేందుకు మహిళలంతా సంఘటితంగా ఉద్యమించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ మండల మొదటి మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..​మహిళల హక్కుల పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయ సాధన కోసం సమాఖ్య పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతే సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. గ్రామస్థాయి నుంచి మహిళా సమాఖ్యను బలోపేతం చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల సాధనకు ముందుకుసాగాలని కోరారు. అనంతరం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ చౌటుప్పల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

​అధ్యక్షురాలు బద్దుల కలమ్మ,

​ఉపాధ్యక్షురాలు బెదరకోట శివరాణి, ​కార్యదర్శి కడవేరి కౌసల్య, ​సహాయ కార్యదర్శి ఎడెల్లి శశికళ, ​కోశాధికారి ఉడత పార్వతమ్మ,

​కార్యవర్గ సభ్యులు గంగనబోయిన లక్ష్మి, కుంటి ధనమ్మ, కుంటి భాగ్యమ్మ, ఏర్పుల అనూష ను ఎన్నుకున్నారు.

Sthanikam

మహిళా వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News