Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

డ్రగ్స్‌, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు.మల్కాజిగిరి సీపీ బడుగుల సుమతి.

28-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

'మీ సురక్ష–సహచరి' విస్తరణకు ఆదేశం.. సీసీ కెమెరాలతో నేరాలకు చెక్.

వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించిన మల్కాజిగిరి సీపీ బడుగుల సుమతి.

వనస్థలిపురం స్థానికం ప్రతినిధి :

ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి నేరాన్నీ ఉపేక్షించొద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, వాటి దర్యాప్తు, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీపీ సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో విచారించి నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొంటూ 'మీ సురక్ష', 'సహచరి' యాప్‌లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల సంఖ్యను పెంచి నేరాల నియంత్రణను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు.

అనంతరం ఏసీపీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సందేశమిచ్చారు.

ఈ సమీక్షలో ఎల్‌బీనగర్ డీసీపీ అనురాధ, అదనపు డీసీపీ రామేశ్వర్‌రావు, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, అశోక్‌రెడ్డి, శంకరయ్య, రాజేష్, సంతోష్‌కుమార్, డీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు.మల్కాజిగిరి సీపీ బడుగుల సుమతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News