సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్‌లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
ని నూతనంగా ఎన్నికైన హోటల్స్ యజమానుల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. హోటల్ రంగ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సేవలు అందిస్తూ అసోసియేషన్‌కు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
అసోసియేషన్ సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ హోటల్ రంగ అభివృద్ధితో పాటు వినియోగదారుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి