రామన్నపేట, జూలై 28
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, పల్లివాడ మాజీ సర్పంచ్ గంగుల వెంకట రాజిరెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక సుభాష్ సెంటర్‌లో వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నకిరేకల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా, పార్టీ బలోపేతానికి గంగుల వెంకట రాజిరెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి