Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:11 PM

రాష్ట్ర హామీల కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి బాధ్యతల స్వీకారం

28-07-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) ప్రాంగణంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ హామీల కమిటీ ఛైర్మన్‌గా ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై పుష్పగుచ్ఛం అందజేసి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, స్పీకర్‌కు మరియు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, పారదర్శకంగా బాధ్యతలను నిర్వహించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. హామీల కమిటీ ద్వారా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మరింత సమర్థవంతంగా సేవలందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నారాయణఖేడ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి అభినందనలు తెలియజేసి నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Sthanikam

రాష్ట్ర హామీల కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి బాధ్యతల స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News