Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:15 PM

నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

28-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జోగిపేట్ డివిజన్ పరిధిలోని నారాయణఖేడ్ సబ్ డివిజన్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల సమక్షంలో రాష్ట్ర, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సెక్రటరీగా జి. రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోహన్ లాల్, కోశాధికారిగా జ్ఞానేశ్వర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ఐఎన్‌టీయూసీ కంపెనీ సెక్రటరీ భూపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షులు వీరయ్య, కార్యదర్శి శ్రీకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కే. పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని 327 యూనియన్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. ఉద్యోగులు, అధికారులు అందరి సహకారంతో యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Sthanikam

నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News