Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 09:19 PM

హెబ్రోన్ దైవ సేవకులకు ఘన వీడ్కోలు..

హెబ్రోన్ దైవ సేవకులకు ఘన వీడ్కోలు..

హెబ్రోన్ దైవ సేవకులకు ఘన వీడ్కోలు..
July 28, 2026 06:36 PM 187 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


నల్గొండ :నల్గొండ టౌన్ హెబ్రోన్ చర్చి పరిధిలోని మౌంట్ గేరీజిము కొండ ప్రేయర్ హౌస్‌లో దైవ సేవకులుగా సేవలు అందించిన బ్రదర్ బుర్రి జాకోబ్, సేవకురాలు రేచల్ దంపతులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత ఐదేళ్లుగా వీరు అందించిన ఆత్మీయ సేవలను గుర్తించి, ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ అయిన సందర్భంగా ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హెబ్రోన్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ గాబ్రియల్ దైవ సేవకుల దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి, వారి భవిష్యత్ పరిచర్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఐదేళ్ల కాలంలో సంఘ అభివృద్ధికి, ప్రజల్లో ఆత్మీయ చైతన్యానికి వారు చేసిన కృషి ప్రశంసనీయమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు, పెద్దలు పోలే డేవిడ్, ఎం. లక్ష్మయ్య, వి.ఎస్. ప్రవీణ్, పోలీస్ సంజీవ, మిద్దె సంజీవయ్య, సుధాకర్, సమూయేలు, మలాకి, విజయ్ కుమార్, జోసెఫ్, నరేష్‌లతో పాటు ఇతర దైవ సేవకులు పాల్, కృపాదానం, నవీన్, అనిల్ పాల్, ఆనంద్, పలువురు సిస్టర్స్ మరియు చర్చి విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవకులకు వీడ్కోలు పలికారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News