Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి

నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి

నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి
28-07-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో మండల స్థాయి సమన్వయ సమావేశం

జడ్పీ సీఈఓ శోభారాణి, మండల ప్రత్యేకాధికారి రవీందర్

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు గ్రామ స్థాయిలో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. చౌటుప్పల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల ప్రత్యేకాధికారి పి. రవీందర్ అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ​ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఎన్. శోభారాణి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కె. శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ​సమావేశంలో 'వీబీజీ రామ్ జీ జలసిరి' కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, ఫామ్ పాండ్లు తవ్వడంతో పాటు గ్రామాల్లోని బోర్లను రీఛార్జ్ చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి (ఎంపీవో), పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓ, ఈసీ, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ విఓ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News