Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:36 AM

సబ్‌డివిజన్‌లలో శక్తి టీం విస్తృత అవగాహన కార్యక్రమాలు.

27-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని సబ్‌డివిజన్‌ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామాలలో శక్తి టీం ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు, విద్యార్థులు, మహిళలకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, బాలికలు వెంటనే పోలీసుల సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుందో సులభంగా వివరించారు.

అదేవిధంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లోన్ యాప్‌లు, బ్యాంకింగ్ మోసాలు, ఓటీపీ, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోకూడదనే అంశాలపై ప్రజలను అప్రమత్తం చేశారు.

బాల్య వివాహాల దుష్పరిణామాలు, పోక్సో (POCSO) చట్టం, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, వాటిపై అమలులో ఉన్న చట్టాలు, నేరాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత గురించి శక్తి టీం సభ్యులు సమగ్రంగా వివరించారు.

అలాగే అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పిస్తూ..

పోలీస్ అత్యవసర సేవలు – 100 / 112

మహిళల హెల్ప్‌లైన్ – 181

అగ్నిమాపక సేవలు – 101

సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం – 1930

బాలల సహాయ నంబర్ – 1098

గురించి ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని శక్తి టీం సభ్యులు అందించిన సూచనలు, భద్రతా మార్గదర్శకాలను శ్రద్ధగా విన్నారు.

ప్రజల భద్రత, మహిళల రక్షణ, చిన్నారుల సంక్షేమం కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని శక్తి టీం సభ్యులు తెలిపారు.

Sthanikam

సబ్‌డివిజన్‌లలో శక్తి టీం విస్తృత అవగాహన కార్యక్రమాలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News