Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:26 PM

జర్నలిస్టు కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా

జర్నలిస్టు కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా

జర్నలిస్టు కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా
25-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శేఖర్ గౌడ్ కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం.

అన్నెపర్తిలో పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

నల్లగొండ, జూన్ 25:

జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పాలకూరి శేఖర్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి . గురువారం అన్నెపర్తి గ్రామంలో శేఖర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ శేఖర్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలోనూ, జర్నలిజం రంగంలోనూ విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. శేఖర్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

క్లిష్ట సమయంలో అండగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు , మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్కర్ తో పాటు పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన పార్టీ నాయకత్వాన్ని వారు అభినందించారు. శేఖర్ గౌడ్ సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Sthanikam

జర్నలిస్టు కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News