Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:30 PM

డిజిటల్ ఆరోగ్య సేవల్లో యాదాద్రి ఆదర్శంగా నిలవాలి. ప్రతి పౌరుడికి డిజిటల్ ఆరోగ్య గుర్తింపు. జిల్లా కలెక్టర్

25-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి

ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శక వైద్య సేవలు అందించేందుకు డిజిటల్ ఆరోగ్య సేవల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఒకే వేదికపై భద్రపరిచి అవసరమైన సమయంలో అందుబాటులోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, పరీక్షా కేంద్రాలు, ఔషధ దుకాణాలు, వైద్య నిపుణులందరూ తప్పనిసరిగా నమోదులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి పౌరునికి ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్య కల్పించడం ద్వారా వైద్య చరిత్ర, పరీక్షల నివేదికలు, వైద్యుల సూచనలు తదితర వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరచవచ్చని వివరించారు. రోగి అనుమతితో దేశంలోని ఏ నమోదిత వైద్య సంస్థలోనైనా ఈ వివరాలు అందుబాటులో ఉండటం వల్ల త్వరితగతిన, నాణ్యమైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే వ్యక్తిగత ఆరోగ్య వివరాల గోప్యతకు పూర్తి భద్రత కల్పించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వచ్చే రెండు వారాల్లో అన్ని అర్హత కలిగిన వైద్య సంస్థలు, వైద్య నిపుణుల నమోదులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

డిజిటల్ ఆరోగ్య సేవల్లో యాదాద్రి ఆదర్శంగా నిలవాలి. ప్రతి పౌరుడికి డిజిటల్ ఆరోగ్య గుర్తింపు. జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News