Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన

24-06-2026 187 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* కీ.శే. ఊర నరసింహ గుప్త జ్ఞాపకార్థం దాతల పూజలు

​* భక్తిశ్రద్ధలతో వేడుక.. తరలివచ్చిన భక్తులు

మండల పరిధిలోని చిన్నకొండూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహ మండప నిర్మాణ శంకుస్థాపన మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. కీర్తిశేషులు ఊర నరసింహ గుప్త జ్ఞాపకార్థం ప్రముఖ దాతలు ఉప్పల ప్రవీణ్ కుమార్ గుప్త – కళ్యాణి దంపతులు ఈ నవగ్రహ మండప నిర్మాణానికి చేపట్టారు. ఈ సందర్భంగా వారి కుమార్తెలు శృతిక, కార్తిక వేద పండితుల మంత్రోచ్చారణలు, విశేష పూజల మధ్య మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

​అనంతరం దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యమై తమ వంతు ఆధ్యాత్మిక సేవ అందించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ​భక్తుల సహకారంతోనే ఆలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని దేవాలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నవగ్రహ మండపం అందుబాటులోకి వస్తే భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం లభిస్తుందని, దాత కుటుంబం చేసిన ఈ సేవ ఎందరికో ఆదర్శప్రాయమని కొనియాడారు.​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాసు గౌడ్, గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News