Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:32 PM

ప్రతిభను ప్రోత్సహిస్తేనే ఉన్నత శిఖరాలు కక్కిరేణి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

24-06-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతిభ కనబరుస్తున్నారని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ రాజన్‌బాబు అన్నారు. రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుధవారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరితో పాటు ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాట్లాడిన రాజన్‌బాబు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకూ మెరుగుపడుతున్నాయని, విద్యార్థులు అంకితభావంతో చదివి మంచి ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు విద్యా సామగ్రి, ప్రోత్సాహకాలు అందిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశముందని తెలిపారు.

బెస్ట్ సేవా సొసైటీ ఉపాధ్యక్షుడు మిర్యాల రామకృష్ణ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అభినందన పత్రాలు, బహుమతులు అందజేశారు. విద్యార్థుల విజయాలను కొనియాడుతూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. ఉపేందర్, జీఓ ఆర్గనైజర్ వేముల సైదులు, ఉపాధ్యాయులు భద్రయ్య, శ్రీనివాసరావు, శేఖర్‌రెడ్డి, రమేష్, జ్యోతి, విద్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిభను ప్రోత్సహిస్తేనే ఉన్నత శిఖరాలు కక్కిరేణి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News