Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:28 PM

జీవో 46ను రద్దు చేయాల్సిందే. 19 వేల పోలీసు పోస్టులు భర్తీ చేయాలి. బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

24-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జీవో 46 వల్ల పోలీసు నియామకాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో సరిపెట్టకుండా 19 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది పోలీసు అభ్యర్థులు, 30 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. నిరుద్యోగ సమస్యపై డిక్లరేషన్​ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ 19 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతుంటే ప్రభుత్వం మాత్రం 5 వేల పోస్టుల గురించే మాట్లాడుతోందని ఆయన విమర్శించారు. అభ్యర్థులకు 35 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఇవ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకే కటాఫ్ అమలు చేయాలని, తెలంగాణ యువతను నాన్-లోకల్‌గా పరిగణించే పరిస్థితి ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జీవో 46ను సవరిస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. నిరుద్యోగుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. నిరుద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్​, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, అనితా రెడ్డి, భూక్యా కుమార్, ఆకాశ్​, సంధ్య, నవీన్ పట్నాయక్, సింబు నాయక్, నవీన్ గౌడ్, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జీవో 46ను రద్దు చేయాల్సిందే. 19 వేల పోలీసు పోస్టులు భర్తీ చేయాలి. బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News