Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:32 PM

రైల్వే సమస్యలపై డీఆర్‌ఎంకు వినతి. రామన్నపేటలో రైళ్ల నిలుపుదలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి.

24-06-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు రైల్వే భవన్‌లో డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) అధ్యక్షతన నిర్వహించిన రైల్వే సర్వసభ్య సమావేశంలో మాజీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ వనం హర్షిని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం పలు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

కరోనా సమయంలో నిలిపివేసిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను రామన్నపేట రైల్వే స్టేషన్‌లో తిరిగి నిలుపుదల చేయాలని కోరారు. అలాగే రామన్నపేట, చిట్యాల, వలిగొండ, నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రయాణికుల సౌకర్యార్థం మినరల్ వాటర్ ప్లాంట్లు, సీసీ కెమెరాలు, రిజర్వేషన్ కౌంటర్లు, యూటీఎస్ టికెట్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రైళ్ల రాకపోకలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్, డిజిటల్ డిస్ప్లే వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని కోరారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఆధునిక మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు.

ఉరుమడ్ల–నాగారం ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని, ఎల్‌సీ నంబర్లు 22, 23 వద్ద అండర్‌పాసులు నిర్మించి వర్షపు నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. స్టేషన్లకు అనుసంధానంగా రహదారుల అభివృద్ధి చేపట్టాలని కూడా కోరారు.

గుంటూరు డివిజన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లో విలీనం చేసిన అంశంతో పాటు ఇతర రైల్వే సంబంధిత ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించి వినతిపత్రం అందజేసినట్లు వనం హర్షిని చంద్రశేఖర్ తెలిపారు.

Sthanikam

రైల్వే సమస్యలపై డీఆర్‌ఎంకు వినతి. రామన్నపేటలో రైళ్ల నిలుపుదలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News