Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 07:31 AM

వైభవంగా రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం..​

వైభవంగా రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం..​

వైభవంగా రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం..​
24-06-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..

ఆలయ అభివృద్ధికి సర్వశక్తులా కృషి చేస్తాం..

కనగల్ : నల్గొండ జిల్లా కనగల్ మండలం ధరవేశిపురంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు, జమదగ్ని మహర్షుల దివ్య కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు, ఆలయం నుండి కల్యాణ మండపం వరకు మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ మంత్రి కోమటిరెడ్డి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కల్యాణ వేడుకను తిలకించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధరవేశిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అన్ని రకాలుగా సుందరీకరించి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో కనగల్ తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

వైభవంగా రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం..​

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News