Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 10:57 PM

విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ..

విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ..

విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ..
June 24, 2026 09:29 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలన పురస్కరించుకుని ఆర్కేఎస్ ఫౌండేషన్ ఉదారత..


హాజరైన బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్, శానంపూడి సైదిరెడ్డి..

నల్లగొండ : భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా.. నల్లగొండ పట్టణంలో ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం డీవీకే రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పోటీదారులు పిల్లి రామరాజు యాదవ్, హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై దాదాపు 400 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లను అందజేశారు.

బొకేలు వద్దు, నోట్‌బుక్స్ ముద్దు రామరాజు వినూత్న పిలుపు..

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ ఒక వినూత్న పిలుపునిచ్చారు. తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చే నాయకులు, అభిమానులు శాలువాలు, బొకేలు తేవడానికి బదులు.. పేద విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సామగ్రిని తీసుకురావాలని కోరారు. ఈ పిలుపునకు స్పందించిన కార్యకర్తలు, మిత్రుల నుంచి సుమారు 2,000 నోట్‌బుక్స్, 4,000 పెన్నులు, 100 ఎగ్జామ్ ప్యాడ్లు వచ్చాయి. వాటిని నేడు ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రామరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సేవా కార్యక్రమాలు అభినందనీయం సైదిరెడ్డి..

​ఆర్కేఎస్ ఫౌండేషన్ నిరంతరం పేదలకు, విద్యార్థులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని శానంపూడి సైదిరెడ్డి కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. గత 12 ఏళ్లలో ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని.. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో యువతకు, విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పించారని సైదిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విపస్య విద్యా సంస్థల చైర్మన్ బండారు ప్రసాద్, ఆర్కేఎస్ కమిటీ సభ్యుడు, 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణం రాజు యాదవ్, పిల్లి శివరాజు, 25వ డివిజన్ కార్పొరేటర్ నవ్యశ్రీ రాఖీ, 39వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు యూసుఫ్ ఉద్దీన్ పాల్గొన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పోతెపాక సాంబయ్య, మాజీ కౌన్సిలర్ ఊట్కూరు వెంకట్ రెడ్డి, యాణాల కరుణాకర్ రెడ్డి, కందుల శ్రీను, పర్వతం శరత్, లగడపురం వెంకన్న, ఫౌండేషన్ సభ్యులు శ్రీధర్ రెడ్డి, జాన్ రెడ్డి, ఉపేందర్, పిల్లి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News